05-12-2025 11:07:24 AM
హైదరబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గంలోని హిమాయత్ నగర్, నారాయణగూడలో రోడ్లు, డ్రైనేజ్ లకు ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender) శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సంరద్భంగా అనర్హత వేటు అంశంపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ''ఎన్నికల్లో పోరాడటం.. గెలవడం నా రక్తంలోనే ఉంది. రాజీనామా ప్రస్తావన రాలేదు.. సీఎం ఆదేశిస్తే రాజీనామా చేస్తా'' అని దానం వెల్లడించారు. ఎన్నికలు కొత్త కాదు.. ఇప్పటి వరకు 11 ఎన్నికల్లో కొట్లాడానని పేర్కొన్నారు. అనర్హత అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. రేవంత్ రెడ్డి మరో పదేళ్లు సీఎంగా ఉంటేనే తెలంగాణ రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు.