calender_icon.png 5 December, 2025 | 10:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని ఇల్లు దగ్ధం

05-12-2025 09:09:21 AM

రెండు లక్షల ఆస్తి నష్టం

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని పెద్ద సిద్దాపూర్ గ్రామానికి చెందిన సిడం రవి ఇంటికి ప్రమాద వసత్తు  నిప్పు అంటుకొని ఇల్లు దగ్ధం అయినట్లు బాధితులు తెలిపారు. ఇంట్లో పెట్టుకున్న దీపం గాలికి మంటలు చెలరేగడంతో ఇంటికి మంటలు అంటుకోవడంతో ఇంట్లోని బీరువాలో దాచుకున్న 50వేల నగదు, బంగారం, వరి ధాన్యం,ఇంట్లోని సామాగ్రి సైతం కాలిపోయినట్లు బాధితుడు తెలిపారు. ఇట్టి విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ పోర్తేట్టి రవి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇట్టి విషయమై అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. రెండు లక్షల ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరారు.