calender_icon.png 5 December, 2025 | 12:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

05-12-2025 12:01:51 PM

హైదరాబాద్: ఇళ్లు లేని పేదవారికి ఇళ్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేదలకు అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు కేటాయించే బాధ్యత తీసుకున్నామని వివరించారు.

వచ్చే మూడేళ్లలో అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని సూచించారు. మధ్యతరగతి వర్గాలకు ఇళ్లు ఇచ్చేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. జీప్లస్ త్రీ, జీప్లస్ ఫోర్ విధానంలో అర్భన్ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. ప్రస్తుతం మూడు రకాల్లో 3.82 లక్షల ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందన్నారు. కేంద్రం ఇచ్చే సాయంతో నేరుగా లబ్ధిదారుల ఖాతాకు వెళుతుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. మొదటి విడతలో 4 లక్షల ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేయనున్నారు. మార్చి నాటికి లక్ష ఇళ్లు గృహప్రవేశాలు జరుగుతాయని మంత్రి తెలిపారు. ఏప్రిల్ నుంచి రెండో విడత ఇళ్లు పంపిణీ ప్రారంభిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియని తెలిపారు. ముంబై, బెంగళూరు తరహాలో పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.