05-12-2025 12:12:58 PM
హైదరాబాద్: హిల్ట్ పాలసీపై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court ) కేఏపాల్ ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. 9,292 ఎకరాల భూకేటాయింపు నిబంధనలకు విరుద్ధమని కేఏ పాల్ తెలిపారు. భూ కేటాయింపులపై సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని పాల్ కోరారు. ఇప్పటివరకు ఉన్న రికార్డులు సీజ్ చేసి ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 5 లక్షల కోట్ల 9292 ఎకరాల అక్రమ భూ కుంభకోణనికి పాల్పడుతున్నారని పాల్ ఆరోపించారు. భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్‌ను తెలంగాణ హైకోర్టు, బీఆర్ఎస్, బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.