ప్రజాభివృద్ధికి పాటుపడే ఎమ్మెల్యే ధన్‌పాల్
జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలి
మెగా జాబ్ మేళాలో సీపీ సాయి చైతన్య
రెండున్నర వేలకుపైగా నిరుద్యోగులు హాజరు
ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): ప్రజాభివృద్ధికి పాటుపడే ఎమ్మెల్యే దొరకడం నిజామాబాద్ యువత అదృష్టమని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నగరంలోని శ్రీరామ గార్డెన్ లో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ సాయి చైతన్య మాట్లాడుతూ.. ఇంత పెద్ద మొత్తంలో జాబ్ మేళా నిర్వహించటం అభినందనీయమన్నారు. రాజకీయంతో పాటు ప్రజల అభివృద్ధికి పాటుపడే వారు అరుదు గా ఉంటారన్నారు. ఇలాంటి అవకాశాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందూరు యువతలో ఎంతో ప్రతిభ దాగి ఉంది, వారి ప్రతిభకు అవకాశం కల్పించడం కోసం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు.
యువతకు ఉద్యోగం కల్పించడం అంటే కేవలం ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడం కాదని ఒక కుటుంబానికి భరోసా ఇవ్వడం అని స్పష్టం చేశారు. యువతకు సరైన వేదిక దొరకడం లేదని ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని 70కి పైగా కంపెనీలను ఒకే వేదికపైకి తెచ్చామన్నారు. నిజామాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, బీజేపీ కార్పొరేటర్లు లక్ష్మీనారాయణ, బెల్లాల్ శశాం క్, మఠం పవన్, శ్రవణ్, పసునూరి రాము, ప్రసూన శ్రీనివాస్, సుధీర్, కులకర్ణి, బంటు రాము, బంటు ప్రీతి ప్రవీణ్ పాల్గొన్నారు.






