పోలీసు సంక్షేమమే ప్రాధాన్యం
మహిళల భద్రత, గంజాయి నియంత్రణ, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి
పోలీస్ అమరుల త్యాగాలతోనే శాంతి
డీజీపీ సీవీ ఆనంద్
పోలీస్ అమరుల కుటుంబాల కోసం టీజీ వీర్ గ్రీవెన్స్ పోర్టల్
మహబూబాబాద్/జయశంకర్ భూపాలపల్లి/భూపాలపల్లి, ఆగస్టు 9 (విజయక్రాంతి): పోలీసు సంక్షేమమే ప్రాధాన్యమని, నేరాలపై ఉక్కుపాదం మోపుతామని, మహిళల భద్రత, గంజాయి నియంత్రణ, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా భూపా లపల్లి జిల్లాకు వచ్చిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ పలు అంశాలపై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ సైబర్ నేరాలు, గం జాయి అక్రమ రవాణా, రోడ్డు ప్రమాదాల నివారణ, కల్తీ ఆహారం, పోలీసు సిబ్బంది సంక్షేమం, మహిళల భద్రత వంటి అంశాలపై వివరించారు. పోలీసు సిబ్బంది సంక్షే మంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని డీజీపీ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఆత్మహత్య ఘటనలపై స్పందిస్తూ, వాటి వెనుక ఉన్న కారణాలను లోతుగా విశ్లేషించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
చిన్న జిల్లాలైన భూపాల పల్లి, ములుగు ప్రాంతాల్లో పోలీసు శాఖకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నుంచి నిధులు సమకూర్చి చర్యలు చేపడతామని చెప్పారు. నక్సలైట్ హింస ప్రభావిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేలా చర్యలు తీసు కుంటున్నామని తెలిపారు. మహిళల భద్రతకు భరోసా కేంద్రాలు కీలకంగా పనిచేస్తు న్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంతో పాటు దేశంలో ప్రశాంత వాతావరణం, శాంతి భద్రతలకు పోలీస్ అమరవీరుల త్యాగాలే పునాది అని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో నక్సలిజంపై పోరా టంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 28 మంది పోలీస్ అమరవీరుల కు టుంబ సభ్యులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా పోలీస్ అమరవీరుల కుటుంబాల సమస్యలను పరిష్కరించేందుకు ‘టీజీ వీర్’ పేరుతో ప్రత్యేక గ్రీవెన్స్ పోర్టల్‌ను డీజీపీ ప్రారంభించారు.
ఈ పోర్టల్ ద్వారా అమరవీరుల కుటుంబ సభ్యులు తమకు సంబంధించిన ఆర్థిక సహాయం, ఎక్స్‌గ్రేషియా, కారుణ్య నియామకాలు, ఇంటి స్థలాల కేటాయింపు, స్థలాల రిజిస్ట్రేషన్, టైటిల్ సమస్య లు, పెన్షన్, ఇతర సంక్షేమ పథకాలు, ప్రభు త్వ పరంగా అందాల్సిన ప్రయోజనాలకు సంబంధించిన ఫిర్యాదులను ఒకే వేదిక ద్వా రా నమోదు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా డీజీపీ క్యూఆర్ కోడ్ తో కూడిన కుటుంబ కార్డులను అమరవీరుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐ జీ ఇంటెలిజెన్స్ కార్తికేయ, వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఎస్పీ సింధు శర్మ, అడిషనల్ కలెక్టర్ రవి, అడిషనల్ ఎస్పీలు వినోద్, శ్యాం బాబు పాల్గొన్నారు.






