బిగ్గెస్ట్ స్కామర్ యూట్యూబర్!
- అక్రమ మార్గంలో సంపాదన, ప్రశ్నించిన వారిపై బూతులతో దాడి
- వందల మంది నుంచి డబ్బులు వసూళ్ళు
- వార్త రాసిన విలేకరులపై బూతుల పురాణం
కారేపల్లి, మే 24, (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా సింగరేణి మండలం సూర్య తండాకు చెందిన ఓ యూట్యూబర్ పై మరోసారి మోసాల ఆరోపణలు వెల్లువెత్తాయి. తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ స్కామర్ గా గుర్తింపు పొందారు. వందలాది మంది నుంచి వివిధ రూపాల్లో డబ్బులు వసూలు చేసి తిరిగి చెల్లించకుండా మోసం చేశాడంటూ బాధితులు కారేపల్లి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చి తన ఇంటి ముందు ఫ్లెక్సీ కట్టి ఆందోళన చేసిన బాధితుల తరఫున తమ సమస్యలను ప్రజలకు తెలియజేస్తూ వార్త రాసిన విలేకరిపై , ఆ యూట్యూబర్ సోషల్ మీడియా వేదిక గా వాట్సప్ మధ్యమాల ద్వారా బూతులతో దూషించడం తన వ్యక్తిత్వం పట్ల పలు అనుమానాలకు దారితీస్తుంది.
ప్రజల తరపున నిజాలు వెలుగులోకి తీసుకువచ్చిన మీడియాపై ఇలా ప్రవర్తించడం తగదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపైనే ఇలాంటి మాటలతో రెచ్చిపోతున్న యూట్యూబర్ పై సామాన్య నిరుద్యోగులను ఆసరాగా చేసుకుని తన గారడి మాటలతో మోసం చేయడం పెద్ద కష్టమైన పని కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేసి నన్ను బదనాం చేస్తున్నారని నేను లీగల్గా పోరాడతా అంటూ చెప్పడం అనేక మందికి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చాలా మంది నుండి డబ్బులు వసూలు చేసి ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి వారిని మోసం చేయడం పెద్ద కష్టమైన పని కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో బిగ్గెస్ట్ స్కామర్ గా అవతారం ఎత్తి ఇప్పటికే చాలా సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్ ఛానల్ లలో తను చేసిన అవినీతిపై వార్తలు వెలువడిన స్వయంగా వారి ఇంటి ఎదుటగానే బాధితులు వచ్చి ధర్నా చేస్తున్న విషయాలను సంబంధిత అధికారులు పరిగణంలోకి తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని, ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని పలువురు కోరుకుంటున్నారు.






