11-02-2026 12:52:18 PM
కాగజ్ నగర్,(విజయక్రాంతి): కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీలో బుధవారం ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు- శివాని, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప-రమాదేవి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ నికిత్ పంత్ పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల నాదేశించారు.