11-02-2026 12:48:49 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలో మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో బూత్ నెంబర్ 151లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు బాధ్యతగా ఓటు వేయాలని, ఎన్నికల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగాలని ఆకాంక్షించారు.