ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కలిసిన సిరిసిల్ల కలెక్టర్
18-06-2024 02:26 PM
రాజన్న సిరిసిల్ల: జిల్లా నూతన కలెక్టర్ గా సందీప్ కుమార్ ఝా బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎంఎల్ఎ ఆది శ్రీనివాస్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి వచ్చిన ఆది శ్రీనివాస్ స్టేట్ ఛాంబర్ ల్లో జిల్లా కలెక్టర్ కలిసి పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులుపై చర్చించారు. సిరిసిల్ల కలెక్టర్ గా సందీప్ కుమార్ ఝా నియమిస్తు శనివారం రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్ లో ఆయన బాధ్యతలు స్వీకరించారు.






