7 April, 2026 | 2:18 AM

అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే జీఎంఆర్

07-04-2026 12:00 AM

అమీన్ పూర్, ఏప్రిల్ 6 : అమీన్ పూర్ డివిజన్ పరిధిలోని సాయి అంబికా కాలనీ నుండి ఐలాపూర్ తాండ వరకు, లాలా బాయి కాలనీ నుండి బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా వరకు రూ.3.25 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి, బిటి రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నూతన రహదారుల నిర్మాణం ద్వారా ఆయా కాలనీల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

నిర్దేశించిన గడువులోగా రహదారుల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఈఈ సురేష్, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.