బీజేపీతోనే దేశానికి రక్షణ
ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్, ఏప్రిల్ ౬ (విజయక్రాంతి): దేశంలో భారతీయ జనతా పార్టీతోనే దేశ రక్షణ, అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం బీజేపీ 47వ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకొని జెండాలు ఎగురవేశారు. పార్టీ స్థాపించినపుడు 2 స్థానాలతో మొదలై నేడు వరుసగా మూడు సార్లు కేంద్రంలో అధికారంలోకి రావడంలో కార్యకర్తల కృషి ఎంతో ఉందని కొనియాడారు.
వచ్చే ఎన్నికల్లో సైతం అధికారంలో వచ్చే దిశ గా కార్యకర్తలు సమిష్టిగా సమాయత్తం అవ్వాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మహే శ్వర్‌రెడ్డి తన ఇంటిపై పార్టీ జెండాను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి సత్యనారాయణ గౌడ్, పట్టణ అధ్యక్షుడు సుంకరి సాయి, పట్టణ బీజేపీ కౌన్సిలర్లు, జిల్లా పట్టణ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.




