వివోసంఘ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
12-08-2026 12:12 AM
భైంసా, ఆగస్టు 11 ( విజయక్రాంతి);మహిళా సంఘాలను బలోపేతం చేస్తామని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. భైంసా మండలం మంజ్రి గ్రామంలో వీఓ మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
మహిళలు స్వయం ఉపాధి, ఆర్థిక కార్యకలాపాల్లో మరింత ముందుకు సాగేందుకు వీఓ మహిళా సమైక్య సంఘ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మహిళా సంఘాల ద్వారా గ్రామీణ మహిళలకు వివిధ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






