ఆరోపణలకు ఆధారాలు చూపాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 11 (విజయ క్రాంతి): మాజీ డీసీసీ అధ్యక్షుడు కె. విశ్వప్రసాదరావుపై డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ చేసిన ఆరోపణలు నిరాధారమని మున్సిపల్ కౌన్సిలర్లు అన్నారు. మం గళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాపర్తి కార్తీక్, కొండు భారతి, హ నుమండ్లు స్వప్నరాణి, కనక కృష్ణమ్మ, పుష్పలత, లోనారె తారాబాయి మాట్లాడారు. ము న్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి విశ్వప్రసాదరావు కృషి చేశారని,
ఇండిపెండెంట్గా గెలిచిన నలుగురు కౌన్సిలర్లను కాంగ్రెస్కు మద్దతుగా నిలపడంలోనూ కీలక పాత్ర పోషించారని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పదవి కోసం రూ.1.50 కోట్లు ఖర్చు చేశారన్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇకనైనా నిరాధార ఆరోపణలు మానుకుని వాస్తవాలను ఆధారాలతో ప్రజల ముందుంచాలని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయ కులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని కోరారు.






