17-01-2026 06:45:01 PM
విజయక్రాంతి,పాపన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సీఎం కప్ క్రీడలు గ్రామీణ విద్యార్థులకు సువర్ణావకాశమని పాపన్నపేట ఎంపీడీఓ విష్ణువర్ధన్ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రం పాపన్నపేటలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. ఈ పోటీల ద్వారా విద్యార్థులలోని క్రీడా ప్రతిభను గుర్తించే అవకాశముందని, గ్రామాలలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు ప్రభాకర్, రాజేందర్, నాగరాజు, రమేష్, రేణుక, కృష్ణకాంత్, మంగ నర్సింలు, అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.