6 July, 2026 | 11:57 PM

ఇల్లందు వ్యవసాయ మార్కెట్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

27-06-2025 08:27 PM

ఇల్లెందు టౌన్,(విజయక్రాంతి): ఇల్లందు వ్యవసాయ మార్కెట్ ను ఎమ్మేల్యే కోరం కనకయ్య శుక్రవారం ఆకస్మిక తనిఖి చేశారు. ఈ సందర్బంగా ఎరువుల వాడకం పై అక్కడున్న రైతులకు పలు సూచనలు చేశారు. రైతులకు ఎరువులు అందించే విషయంలో అధికారులు సిధ్ధంగా ఉండాలని ఆదేశించారు. మార్కెట్ ను ఆదాయ దిశగా నడిపించాలని పాలకవర్గానికి సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, మార్కెట్ అధికారులు, రైతులు తదితరులు ఉన్నారు.