ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యం
ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యం: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
చండూరు,(విజయక్రాంతి): ప్రజా సమస్యలు పరిష్కారానికై తమ వంతు కృషి చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మర్రిగూడ మండల పరిధిలోని ఎర్రగండ్లపల్లి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మనమందరము కలిసికట్టుగా ఉంటూ, ఒకరికొకరు సహకరించుకోవాలని ఆయన అన్నారు. గ్రామంలోకరెంటు లూస్ లైన్, కరెంట్ పోల్స్, త్రాగునీటి పైపులైన్ ల ను సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా తక్షణమే పరిష్కార మార్గం చూపాలని ఆయన అన్నారు. గ్రామంలో మురుగునీరు, డ్రైనేజీ సిస్టంసమస్య తక్షణమే అభివృద్ధి చేయాలని ఆయన గ్రామ కార్యదర్శిని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు రానివారికి రెండో విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు కలిసి రావాలని ఆయన అన్నారు.






