13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

భట్టిని కలిసిన ఎమ్మెల్యే

07-01-2026 12:58 PM

పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన కోవలక్ష్మి

కుమ్రంభీంఆసిఫాబాద్, (విజయక్రాంతి): ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను(Deputy CM Bhatti Vikramarka) బుధవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి హైదరాబాదులోని ప్రగతిభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలకు కొండా లక్ష్మణ్ బాపూజీ నామకరణం చేసినప్పటికీ కళాశాల వద్ద బోర్డు ఏర్పాటు చేయలేదని కళాశాలకు సంబంధించిన వెబ్  సైట్ లోను కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు నమోదు చేయాలని కోరారు. దీంతోపాటు చత్రపతి శివాజీ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బట్టి విక్రమార్కను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వీటితోపాటు నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. ఆమె వెంట సీనియర్ నాయకుడు అనుమండ్ల జగదీష్ ఉన్నారు.