calender_icon.png 8 January, 2026 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్‌ఎఫ్‌ఎల్ హెడ్‌మాస్టర్ నిర్లక్ష్యం

07-01-2026 01:00:54 PM

షోకాజ్ నోటీస్ జారీ

నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా సంజయ్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో ఎల్‌ఎఫ్‌ఎల్ హెడ్మాస్టర్(LFL Headmaster)గా పనిచేస్తున్న శేఖర్ విధుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. విధులకు అనధికారికంగా గైర్హాజరవుతూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నాడు. వేలకు వేలు జీతాలు తీసుకుని స్వంత వ్యాపకాలతో విధులకు డుమ్మా కొట్టిన హెడ్మాస్టర్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్‌ కుమార్ మండల విద్యాశాఖాధికారి భాస్కర్‌రెడ్డిని ఆదేశించారు. 

ఇదివరకే గైర్హాజరు అంశంపై మెమో జారీ అయినప్పటికీ ఎలాంటి మార్పు కనిపించకపోగా బుధవారం ఆకస్మిక తనిఖీలోనూ హెడ్మాస్టర్ విధులకు హాజరు కాకపోవడం అధికారులను విస్మయానికి గురిచేసింది. పదేపదే హెచ్చరికలు ఇచ్చినా విధుల్లో నిర్లక్ష్య ధోరణి కొనసాగడం విద్యాశాఖ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ ఘటనపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించిన డీఈవో, వివరణ సంతృప్తికరంగా లేకపోతే కఠినమైన శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రమశిక్షణ లోపిస్తే విద్యా వ్యవస్థే దెబ్బతింటుందని, నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.