07-01-2026 12:43:55 PM
శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): విజయక్రాంతి దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్(VijayaKranthi calendar) ను శేరిలింగంపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మారబోయిన అనీల్ కుమార్ యాదవ్(Anil Kumar Yadav) కొండాపూర్ మసీద్ బండ లోని ఆయన కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయన విజయక్రాంతి తో మాట్లాడుతూ.. సమాజంలో నేడు పత్రికలు వాస్తవాలను దాచి అబద్దాలను ప్రచురిస్తున్నాయని ఎలక్ట్రానిక్ మీడియా వార్తలను ఎవరు నమ్మడం లేని పరిస్థితి వచ్చిందన్నారు. కానీ విజయక్రాంతి దినపత్రిక ప్రజల పక్షపాతిగా కార్మికుల హక్కుల కోసం పేద ప్రజల కోసం ప్రభుత్వాలు తప్పు చేస్తే నిలదీసే దినపత్రికగా ముందుందన్నారు.
అన్ని పత్రికలకు యాజమాన్యాలు సొంత లాభాల కోసం నడిపిస్తుంటే విజయక్రాంతి పత్రిక మాత్రం ప్రజలచే, ప్రజల కోసం విలువలకు కట్టుబడి నడిపిస్తున్న పత్రికగా కొనియాడారు. మతతత్వం పెరుగుతున్న నేటి తరుణంలో లౌకికవాదాన్ని పెంపొందించే ఇలాంటి పత్రిక అవసరం సమాజానికి చాలా ఉంది అన్నారు. విజయక్రాంతి దినపత్రిక పాఠకులకు రిపోర్టర్లకు ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో పత్రిక మరింత అభివృద్ధి బాటలో పయనించాలని కోరుకుంటున్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి సామల్ కార్తీక్,పూర్వ శేరిలింగంపల్లి డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్, మల్లేష్, జగదీశ్, దీపక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.