15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

భీమలింగం కాలువ నిధులకై మంత్రి ఉత్తమ్ ని కలిసిన ఎమ్మెల్యే కుంభం

25-06-2025 06:51 PM

వలిగొండ (విజయక్రాంతి): భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbam Anil Kumar Reddy) హైదరాబాద్ లోని జలసౌదాలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy)ని కలిసి భువనగిరి నియోజకవర్గంలోని వలిగొండ మండలంలోని భీమలింగం కాలువకు నిధులు కేటాయించాలని కోరడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గంలోని బీబీనగర్, భువనగిరి మండలాలకు సంబందించిన బోల్లేపల్లి, పోచంపల్లి మండలానికి సంబందించిన అలీనగర్ కాలువల మరమ్మత్తులకు నిధులు కేటాయించాలని కోరారు. మూసీ వాగుకు సంబంధించిన అన్ని ఫీడర్ కాలువలలో గుర్రపు డెక్క ఆకు తొలగించుటకు, నిర్వాహణకు ప్రతీ సంవత్సరం 1 కోటి 20 లక్షల బడ్జెట్ కేటాయించాలని కోరారు.