17 April, 2026 | 3:10 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

జయన్న ఫౌండేషన్ దాతృత్వం..

25-06-2025 06:54 PM

నిరుపేద కుటుంబానికి జైపాల్ రెడ్డి అండ..

హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కనకలగిద్ద గ్రామానికి చెందిన నిరుపేద తాపీ మేస్త్రీ సగర ఉప్పర కులస్తుడు కురిమిండ్ల నారాయణ ఇటీవల మరణించడంతో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. ఈ విషయం తెలుసుకున్న జయన్న ఫౌండేషన్ ఛైర్మన్ జైపాల్ రెడ్డి(Jayanna Foundation Chairman Jaipal Reddy) తక్షణమే స్పందించారు. మానవతా దృక్పథంతో నారాయణ కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్న జైపాల్ రెడ్డి, వారికి బుధవారం 50 కిలోల బియ్యంతో పాటు రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కుల సంఘం పెద్దలు కొల్లూరి బుచ్చయ్య, కానిగంటి శ్రీనివాస్, కురుమిళ్ళ రాజు తదితరులు పాల్గొన్నారు. జయన్న ఫౌండేషన్ అందించిన ఈ సహాయం పట్ల గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.