4 June, 2026 | 1:12 AM

మాది.. ముమ్మాటికీ జాతీయవాదం

04-06-2026 12:27 AM

తెలంగాణ ప్రజల మనోభావాల్ని చులకన చేస్తే బిడ్డా నాలుకలు తెగ్గోస్తాం..

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 

వనపర్తి, జూన్ 3 (విజయక్రాంతి): నలిగిపోయి, నష్టపోయి, సహనం నశించి పోరాడి సాధించుకున్న రాష్ట్ర ప్రజల మనోభావాలను కించపరుస్తూ ప్రాంతీయ వాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం అంటావా తస్మాత్ జాగ్రత్త అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గర్జించారు.

దేవరకద్ర నియోజకవర్గ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం ఇంచార్జ్ ఆల వెంకటేశ్వర రెడ్డి  అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశములో నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఉద్వేగభరితంగా ప్రసంగించారు. పొట్టిశ్రీరా ములు ఆంధ్ర రాష్ట్ర సాధనకోసం ఆత్మార్పణ చేసుకోవడం ప్రాతీయవాదం అయితే మీరే  నిజమైన ఉగ్రవాదులు అని ఘాటుగా విమర్శించారు.

యూనియన్ ఇండియా సర్వస్వతంత్ర రాజ్యం మా తెలంగాణ అని మీ స్వార్థం కోసం మమ్మల్ని ఉమ్మడి రాష్టములో కలుపుకొని మా సంస్కృతి, సాంప్రదాయాలకు, మా జీవన విధానాన్నకి భంగం కలిగించి అభివృద్ధిలో వివక్షత చూపడం వల్ల సుదీర్ఘ పోరాటంతో మా బిడ్డల ఆత్మ బలిదానాలతో రాష్ట్రం సాధించుకున్నామని అటువంటి మమ్మల్ని అవమానిస్తే బిడ్డా నాలుకలు తెగ్గోస్తాం అని ఆయన హెచ్చరించారు.

మాజీ సి ఎం కె.సి.ఆర్  ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశ ప్రధానే అనుసరించడం అంటే ఆది మన నాయకుణ్ణి సమర్థత అని ఆయన కొనియాడారు. రైతు భరోసా, రైతు బీమా,రైతు రుణ మాఫీ,కె.సి.ఆర్ కిట్టు, కంటి వెలుగు సాగునీటి ప్రాజెక్టుల నవనిర్మాణం చరిత్రలో ఒక చరిత్రాత్మక విజయాలు అని నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమములో మాజీ హోమ్ మినిస్టర్ మహమూద్ పాషా, రాష్ట్ర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు పల్లె రవి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.