శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలకు ఆల్ ఇండియా 141వ ర్యాంక్
ఖమ్మం ఎడ్యుకేషన్ (విజయక్రాంతి) : ఇంటర్న్శాల ర్యాంకింగ్2026లో శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఆల్ ఇండియా 141వ ర్యాంక్, జోనల్ 63వ ర్యాంక్ సాధించింది. దేశవ్యాప్తంగా 800కు పైగా ఇంజనీరింగ్ కళాశాలలు పాల్గొన్న ఈ ర్యాంకింగ్లో ఈ ఘనత సాధించడం గర్వకారణమని చైర్మన్ మల్లంపాటి శ్రీధర్ తెలిపారు. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, ఇంటర్న్షిప్లు, ప్లేస్మెంట్ అవకాశాల కల్పనకు కళాశాల కట్టుబడి ఉందన్నారు.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. సాయి గీతిక మాట్లాడుతూ ఈ విజయం అధ్యాపకులు, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విభాగం, విద్యార్థుల సమిష్టి కృషి ఫలితమన్నారు. డైరెక్టర్ శ్రీమతి శ్రీ విద్య మాట్లాడుతూ సాంకేతిక, కమ్యూనికేషన్ నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ప్రిన్సిపాల్ డా. జె. లక్ష్మి నారాయణ మాట్లాడుతూ ఈ ర్యాంక్ కళాశాల విద్యా ప్రమా ణాలకు గుర్తింపుగా నిలిచిందన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించేలా అధ్యాపకులు నిరంతరం మార్గనిర్దేశనం చేస్తున్నారని తెలిపారు.
భవిష్యత్తులో పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మరిన్ని శిక్షణా కార్యక్రమాలు చేపడతామని యాజమాన్యం పేర్కొంది. కార్యక్రమంలో డీన్ డా. వి. సుదర్శన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వైశాలి, టీపీఓ డా. రాజేష్, డిప్లొమా ఇన్చార్జి కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని కళాశాల సాధించిన విజయంపై హర్షం వ్యక్తం చేశారు.






