22 August, 2026 | 3:21 AM

చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలి

22-08-2026 01:25 AM
  1. పార్టీకి నష్టం చేకూరుస్తున్నారు 
  2. ఖర్గే, కేసీ వేణుగోపాల్, మీనాక్షికి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు 

హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి) : కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పార్టీ అధిష్టానాన్ని కోరారు. శుక్రవారం ఆయన ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ నేతలు కేసీ కేణుగోపాల్, మీనాక్షినటరాజన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

పార్టీ నేతలకు డబ్బులిచ్చి టికెట్లు తెచ్చుకున్నానని తనపై చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం జరిగిందన్నారు. బీఆర్‌ఎస్ నేతలకు సహకరిస్తూ కాంగ్రెకు నష్టం చేస్తున్నారని పార్టీ నేతలకు ఫిర్యాదు చేశారు. అ యితే గాంధీభవన్‌లో మేఘారెడ్డికి వ్యతిరేకంగా చిన్నారెడ్డి వర్గీయులు ఆందోళన వ్యక్తం చేశారు.