8 April, 2026 | 4:21 PM

Breaking News

మళ్ళీ కోర్టుకు మమతా బెనర్జీ.. TMCని ఓడించలేరంటూ ఫైర్   •   భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు   •   ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా నితీష్ ప్రమాణస్వీకారం.. సీఎం పదవికి రాజీనామా తేదీపై అనిశ్చితి   •   ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం: మంజీ నాయక్   •   సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్   •   నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి   •   ప్రజల వద్దకే మినీ బ్యాంక్ సేవలు   •   ఈనెల 21న మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక   •   ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు   •  

రూ.7.20 కోట్లతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

05-11-2025 12:33 AM

రామచంద్రాపురం, నవంబర్ 4:పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఘనపూర్, కర్దనూరు, వెలిమల, తెల్లాపూర్ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, యుజిడీలు, ప్రహరీ గోడల నిర్మాణ పనులకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ పనులు మొత్తం రూ.7 కోట్ల 20 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ప్రాథమిక వసతులు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి కాలనీ, ప్రతి వీధి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తామన్నారు. ప్రజల సౌకర్యాల కోసం నిధులు కేటాయించి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, సీనియర్ నాయకులు సోమి రెడ్డి, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కాశిరెడ్డి, కుమార్, చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అజయ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.