calender_icon.png 5 November, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవితంలో గెలవాలంటే క్రమశిక్షణ ముఖ్యం

05-11-2025 12:35:23 AM

ఎంపీ మాధవనేని రఘునందన్ రావు 

మెదక్, నవంబర్ 4 (విజయక్రాంతి): యువత గెలవాలంటే క్రమశిక్షణ ముఖ్యమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విద్యార్థులకు సూచించారు. మెదక్ పట్టణంలోని స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా యువజనోత్స వాలలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. అంతకుముందు స్వామి వివేకనంద చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో గెలవాలంటే క్రమశిక్షణ ఒక్కటే మార్గం అన్నారు. బట్టి చదువులకు స్వస్తి చెప్పి విశ్లేషణాత్మకంగా చదవాలన్నారు. లక్ష్యం చేరాలంటే సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. మహిళా క్రికెట్లో భారత మహిళా జట్టు విజయం సాధించి 140 కోట్ల మంది భారతీయుల అభిమానాన్ని చురగోన్నారని గుర్తు చేశారు.

యువతలో గెలుస్తాననే తపన ఉండాలన్నారు. తెలంగాణ నుంచి నిక్కత్ జరీన్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు షీల్డ్, ప్రశంసా పత్రం అందించి, శాలువతో ఎంపీ రఘు నందన్ రావును సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి రమేష్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.