05-11-2025 12:32:21 AM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, నవంబర్ 4 :పటాన్ చెరులో మెరుగైన ఉపాధి అవకాశాల కోసం పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని గత 12 సంవత్సరాలుగా కృషి చేయడం వల్ల ఈరోజు కళాశాల ఏర్పాటు అయ్యిందని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు. మున్నూరు కాపు ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన విద్యార్థుల ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై దిశా నిర్దేశం చేశారు.
నూతనంగా ఏర్పాటైన కళాశాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఫర్నిచర్, కంప్యూటర్ ల్యాబ్ తో పాటు సరిపడా సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. కళాశాలకు శాశ్వత ప్రతిపాదికన భవనం ఏర్పాటు చేసేందుకు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పోచారం పరిధిలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించబోతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇంజనీరింగ్ కళాశాల సైతం ఏర్పాటు చేసేలా భవనాన్ని నిర్మించబోతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ విజయ కుమార్, పిఎస్‌ఎస్ ట్రస్ట్ ప్రతినిధి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, నాగరాజు, బాబా వలి, వెంకటేష్, భోజయ్య, అశోక్, రాజు, షకీల్, రామిశెట్టి, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.