18 April, 2026 | 10:32 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

ఇందిరమ్మ ఇళ్లకు ఎమ్మెల్యే భూమి పూజ

24-06-2025 12:17 AM

ఇల్లెందు టౌన్, జూన్ 23 (విజయక్రాంతి): ఇల్లందు మండలం బొజ్జాయిగూడెం, సుదిమళ్ళ, బా లాజినగర్, సుభాష్ నగర్, రాఘబోయిన గూడెం గ్రామాలలో రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య భూమి పూజా చేశారు. రాష్ట ప్రభుత్వం ఆర్ధికంగా ఇబ్బందులో ఉన్నప్పటికి పేద ప్రజల అభివ్రృధ్ధే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. గ్రామాలలో అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని, సంక్షేమ పధకాలు అమలు చేస్తామన్నారు.

గ్రామిణ ప్రాంతాలు అభివ్రృధ్ధే ధ్యేయంగా పనిచేస్తున్న కాం గ్రెస్ పార్టీని రాబోయే స్ధానిక సంస్ధల ఎన్నికలలో అన్ని స్ధానాలలో గెలుపించి ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మెన్ బానోత్ రాం బాబు, మాజీ ఎంపిపి వైస్ ఎంపిపి చీమల నాగరత్నం, మండల రాము, మోకాళ్ళ వెంకటమ్మ, మండల పార్టీ అధ్యక్షులు పులి సైదులు, నాయకులు కాకాటి భార్గవ్, పూనెం సురేందర్, శివ, తాటి భిక్షం, సొసైటి చైర్మెన్ మెట్ల క్రిష్ణ, ప్రసన్న కుమార్ యాదవ్, ధనుంజయ్, అరెం కిరణ్, మాజీ సర్పంచులు కల్తి పద్మ, పాయం స్వాతి, చీమల వెంకటేశ్వర్లు, కునుసోత్ రాము , చెన్నూరి క్రిష్ణ తదితరులు పాల్గోన్నారు.