calender_icon.png 25 June, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ వద్దంటూ మొక్కలు నాటిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

24-06-2025 12:18:22 AM

కోదాడ జూన్ 23: కోదాడలోని జడ్పీ బాయ్స్ హై స్కూల్ లో యాంటీ డ్రగ్స్ అవగాహన వారోత్సవాలలో భాగంగా సోమవారం  అంతర్జాతీయ మాదకద్రవ్య, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి ‘సే టు నో డ్రగ్స్ ‘ అని ట్యాగ్ వేసినారు. ‘హీల్  యువర్ మైండ్ అండ్ ప్లాంట్ ఎ ట్రీ ... సే టు నో డ్రగ్స్‘ నినాదంతో  ప్రతి పాఠశాలలో విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని సందేశం ఇచ్చారు.

జిల్లా పరిషత్ ఉన్నత  పాఠశాలల్లో జిల్లా స్థాయి టాపర్ గా నిలిచిన తాళ్లూరి రేఖశ్రీ ని నగదు బహుమతితో అభినందించారు. కోదాడ మండల విద్యాధికారి  ఎండి. సలీం షరీఫ్ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి. మార్కండేయ, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతమ్మ సుధీర్, వైస్ చైర్మన్ బషీర్, అభినవ్ తల్లిదండ్రులు మేకల వెంకటేశ్వర్లు, అరుణ, కొమరగిరి రంగారావు, పారా సీతయ్య, పైడిమర్రి సత్యబాబు, నయీం పాల్గొన్నారు.

చెస్ ఛాంపియన్ మేకల అభినవ్ జయంతి 

పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

 కోదాడ జూన్ 23: చెస్ క్రీడలో ఆసియన్ ఛాంపియన్ గా ఎదిగి కోదాడ పట్టణ పేరును ఖండాంతరాలకు వ్యాపింపజేసిన మేకల. అభినవ్ చిరస్మరణీయుడని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాల ఎదురుగా అభినవ్ 35వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

తల్లిదండ్రులు మేకల. అరుణ, వెంకటేశ్వర్లు, పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి. రామారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ, సుధీర్, మాజీ సర్పంచ్ పారా.

సీతయ్య, ఎంఈఓ సలీం షరీఫ్, పైడిమర్రి సత్తిబాబు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షేక్ బషీర్, దొంగరి శ్రీను ఈదుల కృష్ణయ్య, బొలిశెట్టి. కృష్ణయ్య, షేక్ నయీమ్, కమదన చందర్రావు, పంది తిరపయ్య, నామ నరసింహారావు, హెచ్‌ఆర్ రాజేష్, సుందరి వెంకటేశ్వర్లు, నాగేంద్రబాబు, నాగమల్లేశ్వరి, రహీం, గంధం పాండు, బాజన్, ముస్తఫా, కర్ల సుందర్ బాబు పాల్గొన్నారు.