2 May, 2026 | 1:24 AM

ఎన్నో ఏండ్ల కలను నెరవేర్చిన

02-05-2026 12:01 AM

ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి 

భూత్పూర్, మే 1 : ఏండ్ల కలను దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి నెరవేర్చారు. భూత్పూర్ నుండి మిట్యాతాండా, లంబడి కుంట తండా, కొర్లవంపు తండా, ముసలయ్య పల్లి, పెద్ద తండాల మీదుగా కరివేన వెళ్లే బిటి రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే పూర్తయిన బీటీ రోడ్డును ఆయన పరిశీలించారు. కరివేన నుంచి భూత్పూర్ కు వెళ్లే దారి వరకు బీటి రోడ్డు వేయడంతో తాండవాసులు, కరివేన గ్రామస్తులు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

ఎమ్మెల్యే ఎన్నో ఏండ్ల కలను నెరవేర్చినందుకు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మూడవత్ బాలకోటి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేసి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ కదిరి శేఖర్, యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్. భూపతి రెడ్డి, సర్పంచులు వెంకటేష్, ఆనంద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుపతిరెడ్డి తో పాటు తదితరులు పాల్గొన్నారు.