05-06-2025 12:02:15 AM
- సర్దార్ ఆత్మహత్యకు కారణమంటూ దుష్ప్రచారం: ఫసియుద్దీన్
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 4 (విజయక్రాంతి): బీఆర్‌ఎ స్ నాయకుడు సర్దార్ ఆత్మహత్యకు తానే కారణమంటూ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మా గంటి గోపినాథ్ తనపై తప్పుడు ప్రచారం చేస్తూ తనను మానసికం గా వేధిస్తున్నాడని జీహెచ్‌ఎంసీ మా జీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవా రం ఆయన మీడియాతో మాట్లాడు తూ.. సర్దార్ తనకు తమ్ముడు లాం టివాడని చెప్పారు. ప్రమాదవశాత్తు మృతిచెందాడని, ఇట్టి విషయం పోస్టుమార్టం రిపోర్టులోనే తేలిందని చె ప్పారు. సర్దార్ మృతికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎమ్మెల్యే గోపీనాథ్ పనిగట్టుకొని తనపై తప్పుడు ప్రచారం చేస్తూ, తనను రాజకీయంగా దెబ్బతీయాలని కుట్రలు పన్నుతున్నాడని ఆరోపించారు.