6 April, 2026 | 9:44 PM

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

06-04-2026 07:58 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ నియోజక వర్గంలోని నిర్మల్ టౌన్, నిర్మల్ రూరల్, సారంగాపూర్, దిలావర్ పూర్, నర్సాపూర్, లక్ష్మణ్ చందా, మామడ, సొన్ మండలాలకు చెందిన 102 మంది  లబ్దిదారులకు రూ. 25,86,000/-ల సీఎంఆర్ఎఫ్ చెక్కులను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి  పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి సత్యనారాయణ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, జిల్లా పట్టణ బీజేపీ నాయకులు, పట్టణ అధ్యక్షులు, పట్టణ కౌన్సిలర్లు, మండల అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.