భూభారతి చట్టం.. రైతుల చుట్టం
అంతర్గాంలో భూ భారతి రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్..
పెద్దపల్లి (విజయక్రాంతి): భూభారతి చట్టం, రైతుల చుట్టమని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్(MLA Makkan Singh Raj Thakur) అన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎక్లాస్పూర్, అంతర్గాం గ్రామంలో ప్రబుత్వం ప్రవేశపెట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులో తహశీల్దార్ తూమూ రవీందర్ పటేల్ నిర్వహించారు.
ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ... రాష్ట్ర ప్రబుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం, రైతుల చుట్టమని, భూమి హక్కులు భద్రం, భూసమస్యల సత్వర పరిష్కరం, రైతుల మేలు కోసం ప్రజాపాలనలో చారిత్రక మార్పు అనే నినాదంతో ప్రవేశపెట్టిన ఈ భూభారతి రెవెన్యూ సదస్సును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని, ప్రజలకు భూసంబంధిత సేవలు సులభంగా, పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు, గ్రామస్థాయిలో భూ సమస్యలు, పట్టాదారుల పాస్ బుక్స్, నక్షల ప్రకటనలు, హక్కుల గుర్తింపు వంటి అంశాలపై అధికారులు ప్రత్యక్షంగా సమాధానాలు ఇచ్చారు.
భూ నమోదు ప్రక్రియలను వేగవంతం చేయాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని, అధికారుల సమక్షంలో తక్షణ పరిష్కారానికి దోహదపడే ఒక మౌలిక వేదికగా భూ భారతి రెవెన్యూ సదస్సు నిలిచిందని మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ తూమూ రవీందర్ పటెల్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, డిప్యూటీ తహిశీల్దార్ ఏం. తిరుపతి, ఆర్బీఐ లు శ్రీమాన్, రమేష్, రెవెన్యూ సిబ్బంది, పంచాయతి కార్యదర్శులు, ప్రజాప్రతినిదులు, రైతులు పాల్గొన్నారు.






