4 July, 2026 | 1:01 AM

సర్ కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ

04-07-2026 12:18 AM

ప్రకటించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి) : ప్రత్యేక ఎన్నికల జాబితా సవరణ కార్యక్రమంలో పార్టీ తరపున బీఎల్‌ఏలను సమన్వయం చేయడం కోసం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక సమన్వయ, పర్యవేక్షణ కమిటీని ప్రక టించారు. సాఫీగా పార్టీ తరఫున కార్యక్రమం కొనసాగించేలా చూడడం ఈ కమిటీ ప్రధాన బాధ్యతగా ఉంటుందని తెలిపారు.

పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కమిటీలో ఎమ్మెల్సీలు ఎల్. రమణ, డాక్టర్ శ్రవణ్ దాసోజు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పార్టీ జనరల్ సెక్రటరీ భరత్ కుమార్ సోమా, మాజీ చైర్మన్‌లు మన్నె కృషాంక్, సతీష్ రెడ్డి. వై, పార్టీ నేతలు పాల్గొన్నారు.