18 April, 2026 | 2:20 AM

మిర్యాల గ్రామంలో ఎమ్మెల్యే మందుల సామెల్ పర్యటన

18-04-2026 12:44 AM

బాధిత కుటుంబాలకు పరామర్శ.. రోడ్డు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!

నూతనకల్, ఏప్రిల్ 17:తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ శుక్రవారం మండలంలోని మిర్యాల గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన మెంచు చక్రయ్య మరియు గ్రామ సర్పంచ్ అనంతుల శ్రీనివాస్ మాతృమూర్తి కుటుంబాలను ఆయన పరామర్శించారు.వారి చిత్రపటాలకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఈ కష్టకాలంలో ప్రభుత్వం మరియు పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.అనంతరం, గ్రామం నుండి మండల కేంద్రానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారిందని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.దీనిపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే.. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి, రోడ్డు నిర్మాణానికి తక్షణమే అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

నిధులు మంజూరు చేయించి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే తక్షణ స్పందనతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నాగం సుధాకర్ రెడ్డి, నాయకులు జెన్నారెడ్డి వివేకరెడ్డి, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.