ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే మర్రి
29-05-2026 12:35 AM
మేడ్చల్, మే 28(విజయ క్రాంతి): సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్‌ఓసికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మంజూరైన ఆర్థిక సహాయ పత్రాలను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పంపిణీ చేశారు.వెంకటాపురం డివిజన్కు చెందిన ధరణి శ్రీ కి రూ.50వేల విలువైన సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌ఓసి పత్రాన్ని ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ పేద, మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర పరిస్థితుల్లో ఎంతో అండగా నిలు స్తోందని తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో సహాయం అందేలా నిరంత రం కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, శ్రీనివాసులు, సురేష్, విజయ్, శేఖర్, రమేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.






