29 May, 2026 | 2:54 AM

ఎమ్మెల్యేను కలిసిన సువీన్ యాదవ్

29-05-2026 12:36 AM

బోయినపల్లి: మే 28(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి నూతన మండల అధ్యక్షుడిగా ఎన్నికైన కొమ్మనబోయిన సువిన్ యాదవును వేముల వాడ ఏం ఎల్ ఏ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అభినందించారు.

బోయినిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కొమ్మనబోయిన సువీన్ యాదవ్ వేములవాడ శాస నసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ గౌరవనీయు లు శ్రీ ఆది శ్రీనివాస్ ను నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సు వీన్ యాదవ్ కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివా స్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఆది శ్రీనివాస్ గారు సువీన్ యాదవ్కు అనంతరం శాలువ కప్పి సత్కరించారు.

కుటుంబ అనుబంధాన్ని గుర్తుచేసుకున్న విప్

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ మర్యాదపూర్వక సమావేశంలో బోయినిపల్లి మండల పరిధిలోని పలువురు ముఖ్య ప్రజాప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా తడ గొండ గ్రామ సర్పంచ్ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ చేపూరి వెంకటేష్, మైనారిటీ నాయకులు మహమ్మద్ హుస్సే న్, ఇ టీవల నూతనంగా ఎంపికైన ఆత్మ కమిటీ మెంబర్ గుడి శ్రీనివాస్ రెడ్డి, మరియు కాం గ్రెస్ పార్టీ నాయకులు తదితరులున్నారు.