24-05-2025 12:00:00 AM
కల్లూరు, మే 23 (విజయ క్రాంతి) ః తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ నిర్మాణం లో భాగంగా పెనుబల్లి మండలం లోని అన్ని గ్రామాల వారీగా మొత్తం 599 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ శుక్రవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదింటి ప్రజల 10 సంవత్సరాలు నిరీక్షణ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇచ్చిన మాట ప్రకారం పేదవాడి సొంత ఇంటి కల నెరవేరుస్తుందన్నారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సత్తుపల్లి నియోజకవర్గంలో ఇందిరమ్మ గృహ నిర్మాణం చేసుకోవటానికి సభ్యులకు ఇందిరమ్మ పట్టాలు అందించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే పేద కుటుంబలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి రాజేందర్,ఎంపీడీఓ, తహసీల్దార్,హౌసింగ్ ఆఫీసర్,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్,ఖమ్మం జిల్లా జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు నారాయణ వరపు శ్రీనివాస్, కల్లూరు చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి,సత్తుపల్లి మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, వైస్ చైర్మన్ కోటేశ్వరరావు, యూత్ కాంగ్రెస్ సత్తుపల్లి నియోజకవర్గం అధ్యక్షులు పసుమర్తి విశ్వనాధం,మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, కిసర శ్రీనివాస్ రెడ్డి,ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి పొట్లపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.