23-05-2025 11:48:53 PM
మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలోని రామన్ కాలనీ కొల్ బెల్ట్ రహదారిపై వర్షం నీరు నిలవకుండా మున్సిపల్ అధికారులు శుక్రవారం చర్యలు చేపట్టారు. పట్టణంలో ఇటీవల కురిసిన వర్షానికి రామన్ కాలనీలోని కోల్ బెల్ట్ రహదారిపై వర్షం నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పరిచింది. వర్షం నీరు నిలవడం మూలంగా పట్టణవాసులు పాత బస్టాండ్ నుండి మార్కెట్ వైపు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కురిసినప్పుడల్లా ఇబ్బందులు తప్పడం లేదని సమస్యను వెంటనే పరిష్కరించాలని పట్టణ ప్రజలు అధికారులను కోరగా స్పందించిన మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాయలింగు రామన్ కాలనీ లో వర్షం నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు సిబ్బంది కోల్ బెల్ట్ రహదారి మధ్యలో ఉన్న డివైడర్ కింది భాగంలో గోయి తీసి పైపు లైన్ ద్వారా వర్షం నీరు బయటికి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. రామన్ కాలనీలో వర్షం నీరు నిలవకుండా చర్యలు చేపట్టడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాయలింగు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ సందీప్, శానిటరీ ఇన్స్పెక్టర్ వి శ్యాంసుందర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు