23-05-2025 11:46:42 PM
-ఎమ్మెల్యే అనిల్ జాదవ్
బోథ్, మే 23 (విజయక్రాంతి): అకాల వర్షాల కారణంగా తడిసిన ప్రతి గింజ ధా న్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేపట్టాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రభుత్వానికి విన్నవించారు. శుక్రవారం నేరడిగొండ మం డల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించా రు.
ఈ సందర్భంగా వర్షానికి తడిసిన జొన్నలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని తడిసిన ప్రతీ ధాన్యం గించను ప్రభుత్వమే కొను గోలు చేసేవరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ పార్టీ తరపున ఒత్తిడి తీసుకొస్తామన్నారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపీ పీలు రాథోడ్ సజన్, తుల శ్రీనివాస్, ప్రీతం రెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ నానక్ సింగ్, మాజీ ఉప సర్పంచ్ లు దేవేందర్ రెడ్డి, శిరీష్ రెడ్డి, కృష్ణ రెడ్డి, సురేందర్ యాదవ్, ప్రశాంత్ గార్లతో పాటు ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.