అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే, మేయర్
12-08-2024 01:24 PM
కరీంనగర్: మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు కరీంనగర్ 6వ డివిజన్ లో ఎస్ డబ్ల్యూజీ డ్రైన్, సిసి రోడ్ పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ కొలమాలతి సంపత్ కుమార్, కాలనీవాసులు పాల్గొన్నారు. పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు.






