రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర
కాంగ్రెస్‌తోనే దళితులకు భవిష్యత్తు
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి, మే 9: రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోందని, దళితులంతా ఏకమై కమలం పార్టీకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రామడుగు మండలం షానగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో గురువారం నిర్వహించిన దళిత సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో దళితులంతా ఎటువైపు ఉండాలనే అంశాలపై చర్చించడానికే ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. దళితులకు ఏదైనా పార్టీ, ప్రభుత్వం అండగా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ మాత్రమేనన్నారు. బీజేపీ దళితుల మీద కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కరీంనగర్ పార్ల మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కొండగట్టు దేవాలయ డైరెక్టర్ బండపెల్లి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
పలు గ్రామాల్లో ప్రచారం..
నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావుకు మద్దతుగా ఎమ్మెల్యే సత్యం ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గడిచిన పదేళ్లలో బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశాయని విమర్శించారు. రాష్ట్రంలో నేడు ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉందని, ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాజేందర్ రావును పార్లమెంట్‌కు పంపించాలని విజ్ఞప్తి చేశారు.






