4 May, 2026 | 2:33 PM

Breaking News

ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •   జిల్లాలో ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలు   •   మొక్కజొన్న పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 50,000 పరిహారంగా ఇవ్వాలి   •   తరాల చరిత్రను మార్చిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •  

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే

08-10-2025 12:59 AM

బిచ్కుంద, అక్టోబర్ 07 (విజయ క్రాంతి); కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్‌లోని  నివాసంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మంగళవారం సమావేశమయ్యారు..స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా.. జుక్కల్ నియోజకవర్గంలోని పరిస్థితుల గురించి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  ముఖ్యమంత్రి కి వివరించారు.

నిరంతరం తాను ప్రజల మధ్య ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం,గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుండటం, ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని..స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని, నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ఎమ్మెల్యే  ధీమా వ్యక్తం చేశారు..వరదల సమయంలో రాత్రి పగలు తేడా లేకుండా శ్రమించి ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలిచిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అభినందిస్తూ..జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని తెలిపారు అన్నారు.