13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి

27-03-2026 10:55 PM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ వడ్డేపల్లి టీచర్స్ కాలనీ పేస్టులోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించారు. లోకక్షేమం, శాంతి, సమృద్ధి కోసం నిర్వహించే, ఈ పవిత్ర వేడుకల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా దేవాలయంలో సందర్శించి, సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ లోక కళ్యాణార్ధం జరిగే సీతారాముల కళ్యాణం ప్రతి ఇంటికి శుభసాంతులు తీసుకురావాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఐశ్వర్యంతో ఉండాలని అన్నారు. సాయంత్రం సీతారాముల దివ్య శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు.