ఐటీడీఏ పాలకమండలి నిర్వహణపై పట్టింపేది?
- ఏడేళ్లుగా నిర్వహించని పాలకమండలి సమావేశం
- గిరిజనుల సమస్యలపై పట్టింపు లేదా?
ఉట్నూర్, మార్చి 27 (విజయక్రాంతి): ఉట్నూర్ ఐటీడీఏ పాలకవర్గ మండలి సమావేశం ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వ హించాలి. కానీ సమావేశం నిర్వహించక 7 ఏళ్లు గడుస్తోంది. ఫలితంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల్లో పారదర్శకత లోపిస్తుంది.
పాలకవర్గ సమావేశం జరిగితే ప్రభుత్వ పథకాల అమలుపై సమగ్ర చర్చ జరగడంతో పాటు అమలులో లోపాలు, అవకతవకలపై పాలక మండలి సమావేశంలో సభ్యులైన ప్రజా ప్రతినిధులు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. దీంతో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది.
ఇది పరిస్థితి..
పాలకమండలి సమావేశం నిర్వహించిన తర్వాత వచ్చే పాలకమండలి సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారో తీర్మానిస్తారు. ఏఒక్కటి కూడా తీర్మానం చేసిన సమయానికి పాలకమండలి సమావేశం నిర్వహించిన దాఖలాలు కల్పించడం లేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయంలో 2019 లో ఐటిడిఏ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. అప్ప టి నుండి నేటి వరకు పాలకమండలి సమావేశం నిర్వహించడంపై అధికారులతో పాటు ఇన్చార్జి మంత్రి సైతం ఊసే ఎత్తడం లేదు.
అస్తవ్యస్తంగా పథకాలు..
గిరిజనుల సంక్షేమం కోసం ఐటిడిఏ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గిరిజన గ్రామాల్లో రహదారులు, ఇతర అభివృద్ధి పనులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. 2021- సంవత్సరంలో ఇంజనీరింగ్ విభాగం ద్వారా గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణం తో పాటు వాగులపై కల్వర్టులు నిర్మించుటకు కోట్లాది రూపాయలను గత ప్రభుత్వం మంజూరు చేసింది.
మంజూరు అయిన నిధులకు ఐటిడిఏ ఇంజనీరింగ్ విభాగం అధికారులు టెండర్లు వేసి పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. పనులు తీసుకున్న కాంట్రాక్టర్లు నేటికీ పనులు ప్రారంభించకపోగా, కొన్ని పనులు ప్రారంభించిన ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రహదారులతో పాటు గిరి వికాసం పథకంలో గిరిజన రైతులకు మంజూరు చేసిన బోరు బావులకు నేటికీ విద్యుత్ సౌకర్యంతో పాటు మోటార్లు లేక గిరి వికాసం పడక వేసింది.
ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించాలి..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల కోసం విడుదల చేస్తున్న నిధులపై ప్రతి మూడు నెలలకు ఒకసారి ఐటిడిఏ పాలకవర్గ సమావేశం నిర్వహించి గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాలి. 7 సం వత్సరాలుగా ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించడం లేదు. పాలకవర్గ సమావేశంపై నిర్లక్ష్యం చేయరాదు. ఇప్పటికైనా సమావేశాన్ని నిర్వహించి గిరిజనుల సంక్షేమానికి కృషి చేయాలి.
అమృత రావు,జిల్లా మేడి, రాయి సెంటర్ల జిల్లా అధ్యక్షుడు.
ఆలస్యం చేయకుండా నిర్వహించాలి..
ఆలస్యం చేయకుండా ఐటిడిఏ పాల క మండలి సమావేశాన్ని నిర్వహించాలి. అమలవుతున్న పథకాలు, కేటా యిస్తున్న నిధులపై చర్చ జరగాలి. అడ వి ప్రాంతంలో నివాసముండే గిరిజను లు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటే అడవి శాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. ఈ విషయంపై ప్రత్యేక చర్చలు జరపాలి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి.
బాపూరావు, తుడం దెబ్బ, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు.




