13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

జాతికుంట చెరువు సుందరీకరణ

27-03-2026 10:51 PM

- రూ. 1 కోటి 56 లక్షలతో పనులు

- ఎమ్మెల్యే గడ్డం వినోద్ 

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలోని జాతికుంట చెరువు సుందరీకరణ పనులకు రూ.1 కోటి 56 లక్షల వ్యయంతో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  గడ్డం వినోద్ వెంకటస్వామి మాట్లాడుతూ... బెల్లంపల్లి పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. జాతికుంట చెరువు సుందరీకరణ పనులు పూర్తయిన తరువాత ఈ ప్రాంతం మరింత అందంగా మారడంతో పాటు ప్రజలకు విశ్రాంతి కోసం మంచి ప్రదేశంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 

చెరువు పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ పచ్చదనాన్ని పెంపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. పట్టణ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచడం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందనన్నారు. బెల్లంపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తామని  స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య,మున్సిపల్ చైర్మన్ దావ స్వాతి రమేష్ బాబు, 25వ వార్డు కౌన్సిలర్ కంకటి ప్రణీత, 9వ వార్డు కౌన్సిలర్ కంపెల్లి రాజం మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.