12 August, 2026 | 2:42 AM

జిమ్‌కిన్ ఓవరాల్ ఛాంపియన్ ‘గాడియం’

12-08-2026 01:04 AM

ముషీరాబాద్, ఆగస్ట్ 11 (విజయక్రాంతి): ది గాడియం స్కూల్లో అరబిందో ఫార్మా ఫౌండేషన్, గావోఫీ సహకరంతో నిర్వహించిన ’జిమ్క్విన్-2026’ జాతీయ స్థాయి రిథ మిక్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్లో గా డియం స్కూల్ ఓవరాల్ ఛాంపియన్గా నిలిచిందని స్కూల్ వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ కె. కీర్తి రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పే ర్కొన్నారు.

ఆమె మాట్లాడుతూ 15 రాష్ట్రాల నుంచి 1,200 మందికి పైగా పాల్గొనగా, గా డియం స్కూల్ 472, జిమ్నోరా 273, హైఫ్లయర్స్ జిమ్నాస్టిక్స్ అకాడమీ 246 పతకాలు సాధించాయని తెలిపారు. ఎంపీ రఘునందన్ రావు, బ్యాడ్మింటన్ ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, షీ టీమ్స్ డీసీపీ శిరీష రాఘవేంద్ర పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఏజీయూ మహిళల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ టెక్నికల్ కమిటీ అధ్యక్షురాలు రీమా కిజిల్గన్ బహుమతులు అందజేసినట్లు చెప్పారు.