calender_icon.png 23 July, 2025 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొడ్రాయి ప్రతిష్టాపన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

20-05-2025 12:00:00 AM

గూడూరు, మే 19 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దుబ్బ గూడెం గ్రామంలో గ్రామ దేవత బొడ్రాయి, ఆంజనేయస్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు రెండు రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు.

సోమవారం మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ బొడ్రాయి ప్రతిష్టాపన వేడుకలకు హాజరయ్యారు. గ్రామస్తులంతా కలిసి మెలిసి సంఘటితంగా ముందుకు సాగుతూ గ్రామ అభివృద్ధికి ఇదే తరహాలో కృషి చేయాలని ఆకాంక్షించారు.