calender_icon.png 5 May, 2025 | 2:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల పరిష్కారానికి సహకరించండి

24-04-2025 12:52:51 AM

బీహెచ్‌ఈఎల్ యాజమాన్యాన్ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి 

పటాన్ చెరు, ఏప్రిల్ 23 : రామచంద్రాపురం డివిజన్ పరిధిలో బీహెచ్‌ఈఎల్ భూములకు సంబంధించి నెలకొన్న వివాదాలపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీహెచ్‌ఈఎల్ ఈడీ భరణి రాజాను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. బుధవారం బీహెచ్‌ఈఎల్ పరిశ్రమలోని అడ్మిన్ కార్యాలయంలో రామచంద్రాపురం డివిజన్ కు సంబంధించిన ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి యాజమాన్యంతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు.

  ప్రధానంగా  ఈఎస్‌ఐ చర్చి సమీపంలో గల బీరప్ప గుడిని బీహెచ్‌ఈఎల్ పరిశ్రమ భూమిలో ఉందంటూ సంబంధిత అధికారులు తొలగించడం జరిగిందని తెలిపారు. దీంతో పాటు బాంబే కాలనీ సమీపంలో ప్రహరీకి అనుకొని గత దశాబ్దాల కాలంగా స్థానిక పాడి రైతులు పశువుల కొట్టాలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. వీటిని సైతం తొలగించాలని ఇటీవల భెల్ అధికారులు నోటీసులు అందించారని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు.

రాయస ముద్రం చెరువు సమీపంలో గల మసీదు నిర్మాణం సైతం బెల్ పరిధిలో ఉందంటూ అధికారులు ఇటీవల తాకీదులు జారీ చేశారని పేర్కొన్నారు. పై మూడు అంశాల్లో యాజ మాన్యం వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రధానంగా బీరప్ప గుడి అం శంలో కూల్చివేసిన స్థానంలో తిరిగి దేవాలయం నిర్మించ డంతోపాటు విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు. పాడి రై తుల అంశంలో మానవీయ కోణంలో స్పందించాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన బెల్ ఈడి భరణి రాజా.. త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా మని హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం  కార్పొరేటర్ పుష్ప నగేష్, మాజీ కార్పొరేటర్ తొంట అంజ య్య, కురుమ సంఘం అధ్యక్షులు నరసింహ, నాయకులు ఊరెళ్ళ రాజు, ఐలేష్, కరిక సత్యనారాయణ, అంజన్న, యాదగిరి, గోవింద్, మల్లేష్, కుమార్, నరసింహ, లక్ష్మణ్, రవి తదితరులు పాల్గొన్నారు.